
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: కార్తీక మాసం సందర్భంగా శనివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన మయూరి నగర్ కార్తీక మాస వనభోజనోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గాంధీ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని, అందరూ ఏకమయ్యేందుకు కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో పవిత్రమైన తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి శివ నామస్మరణ చేస్తూ కార్తీక మాస వనభోజనాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. పరమ శివుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆధునిక జీవన యానంలో, నిత్యం తీరిక లేని జీవితాలలో అందరితో ఆహ్లాదకరంగా గడిపేందుకు ఈ కార్తీక మాస వన భోజనాలు దోహదపడుతాయని పేర్కొన్నారు. ఒకరినొకరి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఈ వన భోజనాలు ఒక వేదికగా నిలుస్తాయన్నారు.అదేవిధంగా కాలనీ లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛత కాలనీగా తీర్చిదిద్దాలని అన్నారు. అందరి భాగస్వామ్యంతో మయూరి నగర్ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మయూరి నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రావు, ఉపాధ్యక్షులు వెంకట రామిరెడ్డి, లావణ్య, జనరల్ సెక్రటరీ రామరాజు, జాయింట్ సెక్రటరీ ఎంవీ రంగారావు, జాయింట్ సెక్రటరీ కృష్ణ కుమార్, ట్రెజరర్ నర్సింహ రావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుబ్బరాజు, నాగ శేషయ్య, ఫణి కృష్ణ, మధుసూదన్ రావు, పాండ్య, నర్సింహం, శ్రీనివాస రావు, నళిని మోహన్ రావు, గోపాల్ రెడ్డి, అనూష, హారిక, వికాస్, కాలనీ వాసులు కిషోర్, ప్రతాప్ రెడ్డి, చంద్రికప్రసాద్ గౌడ్, అశోక్, శ్రీనివాస్, రంగరాజు, సుబ్రమణ్యం శంకర్ రావు, సోమేశ్వర్ రెడ్డి, రమేష్, బేబీ, స్వాతి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.