Home » కారు గుర్తుకే ఓటేద్దాం బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం : అరెకపూడి గాంధీ

కారు గుర్తుకే ఓటేద్దాం బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం : అరెకపూడి గాంధీ

by Admin
11.1kViews
125 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :   తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని శేరిలింగంపల్లి  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరెకపూడి గాంధీ  అన్నారు.మంగళవారం గచ్చిబౌలి డివిజన్ లో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే రూ.2వేల ఆసరా పింఛన్‌ను రూ.5వేలకు పెంచడంతోపాటు మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ఆడపడుచుల బ్యాంక్‌ ఖాతాల్లో నెలకు రూ.3వేలు జమ అవుతాయని తెలిపారు. వచ్చే జనవరి నుంచి రేషన్‌దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నా రు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కోటి మందికి రూ.5లక్షలకు కేసీఆర్‌ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్లు చె ప్పారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరను బీజేపీ రూ.1000లకు పెంచితే..అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400లకే అందించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్,డివిజన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, డివిజన్ మాజీ ప్రెసిడెంట్ చెన్నం రాజు, సత్యనారాయణ ,అనిల్,విజయ్ భాస్కర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి,వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్ గారు,నరేష్,సతీష్ ముదిరాజ్,అంజమ్మ,ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజుముదిరాజ్,జగదీశ్ ,ఆకుల యాదగిరి,సీనియర్ నాయకులు,రమేష్ గౌడ్,నారాయణ,గోవింద్,అనిల్ సింగ్,శామ్లెట్ శ్రీనివాస్,జగదీశ్,దేవరకొండ అనిల్, చంద్ర శేఖర్,పరమేష్ ,సలావుద్దీన్, అజ్మత్,జకీర్,తహర్, బురాన్,ఖాదర్ ఖాన్,మహేష్ యాదవ్,మక్ బూల్,రవీందర్, సుధాకర్,శామ్లెట్ శ్రీకాంత్,శామ్లెట్ యువరాజ్ శామ్లెట్ త్రినాథ్,శామ్లెట్ సాయి కుమార్,శామ్లెట్ సాయి కృష్ణ కే వై బాబు అజయ్ గౌడ్,దయాకర్,అర్జున్,అరుణ,విజయ,కల్పన,బాలమణి,నీరజ,సుగుణ,మాధవి,కుమారి, రేణుక, రాజేశ్వరి,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment