
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి,ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీని ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందామంటూ శేరిలింగంపల్లి డివిజన్ బిఆర్ఎస్ కార్యకర్తలు,నాయకులు అన్నారు.ఆదివారం డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా,అభివృద్ధి ద్యేయంగా పని చేశానని అన్నారు.ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించడంతో పాటు కాలనీలను ఆదర్శవంతగా తీర్చిదిద్దిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీ అన్నారు. వేలాది కోట్లాతో కాలనీలో సమస్యలన్నీ పరిష్కరించారని.. వేలాది మందికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. చేసిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు కండ్లముందే కనబడుతున్నాయని తెలిపారు.అనంతరం కార్పొరేటర్ రాగం మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా,అభివృద్ధి ద్యేయంగా ముందుకుసాగె గొప్ప నాయకుడు అరెకపూడి గాంధీ అన్నారు.మరోసారి ఆయనను గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమమంలో ప్రథమ స్థానంలో నిలపెడదామ్మారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండే బీఆర్ఎస్ ను ఆదరించాలని,వచ్చే ఎన్నకల్లో కారు గుర్తుకు ఓటేసి గాంధీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, డివిజన్ గౌరవ సీనియర్ నాయకులు, పురప్రముఖులు, ఆయా బస్తీ కమిటి ప్రెసిడెంట్ లు, బూత్ కమిటి మెంబెర్స్, యువ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.