
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలి
పటాన్ చెరులో కాట శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు
తెలంగాణ మిర్రర్, పటాన్ చెరు : పటాన్ చెరు టౌన్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సపాన దేవ్ నివాసంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పటాన్ చెరు నియోజకవర్గం మెంబెర్ షిప్ కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు పార్టీ 2 లక్షల భీమా అందిస్తుందని తెలియజేసారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తమ పరిధిలోని యువకులను ఈ డ్రైవ్ లో మెంబెర్ గా చేర్చాలని పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సపాన దేవ్, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, సంజీవ రెడ్డి, సామయ్య, జయమ్మ, చిన్న తదితరులు పాల్గొన్నారు