Home » కాంగ్రెస్ లో చేరిన బండి రమేష్

కాంగ్రెస్ లో చేరిన బండి రమేష్

by Admin
11.8kViews
123 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :    బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు,పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో  రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బండి  రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్బంగా  ఆయనకు రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తి అయిన బండి రమేష్ కాంగ్రెస్ లో చేరడంతో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. ఆయన రాకతో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే బండి రమేష్ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేదా కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగుతారా అన్నదాని పై స్పష్టత లేదు.

You may also like

Leave a Comment