
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గానికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ గెలుపును ఇక ఏ శక్తి ఆపలేదని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు.మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్, నెహ్రూ నగర్ కాలనీలకు చెందిన బీ ఆర్ ఎస్, బీ జే పీ పార్టీల కు చెందిన 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. చరణ్ రెడ్డి అధ్వర్యంలో శైబాజ్, ముస్తఫా, నవజ్, సమద్ లతో పాటు కాలనీలకు చెందిన యువకులు రఘునాథ్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా వారికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.నియోజకవర్గం ప్రజలకు శాశ్వత అభివృద్ధి జరగలేదని సంక్షేమ పథకాల చాటున ప్రజలను ఏ మార్చారని అన్నారు. ఇప్పటికైనా యువత మేలుకోవాలని ప్రజలను చైతన్యవంతం చేసి బస్తీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా కొనసాగించాలని అన్నారు. ఈ నెలరోజులే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని యువతకు దిశా నిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున పార్టీలోకి స్వచ్ఛందంగా చేరెందుకు వచ్చిన యువతను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భరత్ యాదవ్, రాజేష్ యాదవ్, కిరణ్ రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.