
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజలకు అమలు చేయగలిగే పథకాలు, హామీలనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. బుధవారం కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ చౌరస్తా నుంచి సిద్ధిఖ్ నగర్ లలో గడప గడప కు రఘన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ గా ప్రజలు తరలివచ్చారు. అభిమానులు, పార్టీ నేతలు, పూలవర్షం కురుపిస్తూ.. భారీ ఎత్తున టపాసులు పేల్చుతు అడుగడుగున్న అభిమానులు ఘణస్వాగతం పలికారు.ఈ సందర్బంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు సామాన్యులకు అందనున్నాయని చెప్పారు. ఒక్కో వర్గానికి సంబంధించి ఒక్కో ప్రధానాంశాన్ని పార్టీ ఇచ్చే గ్యారంటీల్లో చేర్చడం జరిగిందన్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త పార్టీకి అండగా నిలవాలని రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కష్టపడాలని సూచించారు.వచ్చే ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తాన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని రఘునాథ్ యాదవ్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు, బస్తీ నేతలు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ నేతలు, బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.