Home » కాంగ్రెస్,బీజేపీ ల పథకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.: ఎమ్మెల్యే గాంధీ

కాంగ్రెస్,బీజేపీ ల పథకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.: ఎమ్మెల్యే గాంధీ

by Admin
8.4kViews
64 Shares
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు.హఫీజ్ పెట్ డివిజన్ మదినగూడాలో నిర్వహించిన డివిజన్‌ ప్రజాఆశీర్వాదసభకు ఆయన  ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 70ఏండ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో ఒక్కసారి తమకు అవకాశం కల్పించాలంటూ కల్లబొల్లి కబుర్లుచెబుతూ ప్రజలను మాయమాటలతో బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఈ రెండుపార్టీలు తెలంగాణకు ఏం చేశారని ఓట్లకోసం వస్తున్నారని ప్రశ్నించారు. కాని సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ తొమ్మిది ఏండ్ల కాలంలో తన మేథాశక్తిని ఉపయోగించి డబ్బు ఏండ్లల్లో జరుగని అభివృద్ధిని చేసి చూపించారని స్పష్టం చేశారు.అనంతరం డివిజన్ పరిధిలోని మదీనాగూడకు చెందిన కాంగ్రెస్,బీజేపీ పార్టీలకి చెందిన నాయకులు,కార్యకర్తలు  బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికీ గాంధీ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీ మ్యానిఫెస్టోను,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment