
1.2kViews
శేరిలింగంపల్లి (తెలంగాణ మిర్రర్): బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందా నగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి, బిజెపి నేత కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి లు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా డికె అరుణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, యువతకు, మహిళలకు పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. కొద్దిలో ఓడినా భవిష్యత్తులో దానిని పునాదిగా చేసుకొని ఇంకా జనాల్లో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పనితనాన్ని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె కోరారు.