
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి: శంకర్ పల్లి లోని శుభ గృహ వెంచర్ లో దారుణం. బొడ వెంకటయ్య అనే వ్యక్తి దారుణ హత్య. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని అలంఖాన్ గుడలోని శుభ గృహ వెంచర్ లో దారుణం చోటుచేసుకుంది. శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామానికీ చెందిన వెంకటయ్య అనే వ్యక్తిని కళ్లలో కారం చల్లి కత్తులలో నరికి చంపిన దుండగులు. తలతో పాటు రెండు చేతులను కత్తులతో నరికి అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు. అర్థరాత్రి నీతో పని వుంది అని చెప్పి శుభ గృహ వెంచర్ వద్దకు రావాలని ఫోన్ చేసిన దుండగులు. వెంచర్ వద్దకు వెళ్లగానే వెంకటయ్య పై దాడి చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. మృతినికి ఇద్దరు కుమారులు ఉన్నారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు. మృతుని శవాన్ని చేవెళ్లప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..శంకర్ పల్లి సీఐ మహేశ్ వివరాల ప్రకారం మాకు ఉదయం 6 గంటలకు ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లగా రక్తపు మడుగులో బొడ వెంకటయ్య మృతదేహం పడి ఉందని అన్నారు.. అప్పటికే మహాలింగపురం గ్రామస్థులు అక్కడ ఉండడం జరిగింది.మృతుని బార్య హంసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు..నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.