Home » కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాలు పేదల పాలిట వరం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాలు పేదల పాలిట వరం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

by Admin
1.2kViews

*41 మందికి కల్యాణ లక్ష్మి,షాదిముబారక్ చెక్కుల అందజేత 

తెలంగాణ మిర్రర్,అమీన్‌పూర్ : ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదల పాలిట వరంలా మారాయని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి,అమీన్‌పూర్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.గురువారం అమీన్‌పూర్ లోని బాలాజీ కన్వెన్షన్ లో పలు కాలనీలకు చెందిన 41 మంది లబ్దిదారులకు రూ.41 లక్షల విలువ గల కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని పేర్కొన్నారు.అనంతరం చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసీ సుధాకర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ సుజాత,తహసీల్దార్ విజయ్ కుమార్,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment