
తెలంగాణ మిర్రర్,మియాపూర్ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు.బుధవారం ప్రభుత్వ విప్ గాంధీ నివాసంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్,దొడ్ల వెంకటేష్,రోజాదేవి రంగరావు లతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్ లకు చెందిన లభ్ధిదారులకు రూ.80 లక్షల 9 వేల 2 వందల 80 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయం నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.కరోనా సంక్షోభంలో సైతం ఆడపిల్లల పెళ్లికి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయన్నారు.ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి,ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్ ,మోజేష్,మధు,చంద్రమోహన్ సాగర్,అంజనేయులు, గుడ్ల శ్రీనివాస్ శ్రీహరి ,మున్నా,రాములు ,శ్రావణి రెడ్డి,పద్మ తదితరులు పాల్గొన్నారు.