
1.1kViews
తెలంగాణ మిర్రర్,పరిగి : కరోనా వ్యాప్తి నివారణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.మంగళవారం పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో 60 సంవత్సరాల వారికీ ఇస్తున్న బూస్టర్ డోస్ ను ఎమ్మెల్యే పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యతగా వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి బూస్టర్ టీకాను వేస్తున్నామని చెప్పారు.కరోనా వ్యాప్తి నివారణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, కచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎంపీపీ కరణం అరవింద్ రావు ,పరిగి వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ సురేందర్, తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, కౌన్సిలర్లు మునీర్, వేముల కిరణ్,ఆసుపత్రి సూపరిండెంట్ సిబ్బంది పాల్గొన్నారు.