
430Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్క్లెవ్ వద్ద పలు ప్రాంతాల నుండి వచ్చిన ట్రక్ డ్రైవర్లకు కరోనా మహమ్మారిపై సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఎషియన్ పెయింట్స్ సహకారంతో చైల్డ్ సర్వైవల్ ఇండియా ద్వారా ట్రక్ డ్రైవర్లకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శశి మనోహర్, సభ్యులు నీరజ్ కుమార్ సింగ్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.