
1.3kViews
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : పటాన్‌చెరు మండలం పాటిలో ఈ నెల 25,26 న జై బజరంగ్ దళి కబడ్డీ టీమ్ ఆధ్వర్యంలో జరగనున్న ఆల్ ఇండియా ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహణ కోసం సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ బుధవారం తన వంతు సహాయంగా 50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్ యాదవ్,ఈశ్వర్, దినేష్, రాజేష్ పాల్గొన్నారు.