
తెలంగాణ మిర్రర్ ,శేరిలింగంపల్లి : ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతరాజ్యంగం మనకు కల్పించిన హక్కు ఓటు అని హోప్ పౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును సద్వినియోగం చేసుకుని, ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకున్నట్లైతే ప్రజాస్వామ్యానికి మనం ఎంతో మేలు చేసినవారమౌతామని హోప్ చైర్మన్ కొండ విజయ్కుమార్ వివరించారు. సోమవారం ఓటరు అవగాహణ కార్యక్రమంలో భాగంగా చందానగర్ లోని హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కరపత్రాన్ని చైర్మన్ కొండ విజయ్ కుమార్ తోపాటు పలువురు స్వచ్చంధ సంస్థలవారు హజరై విడుదల చేశారు. అనంతరం కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యంగం మనకు కల్పించిన ఓటుహక్కు పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం 7 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయని, గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఇప్పటివరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యాబై శాతానికి మించి ఓటరు శాతం పెరగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు కలిగిన నియోజకవర్గంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటు శాతం సద్వినియోగం చేసుకునే విషయంలో మాత్రం వెనుకబడి ఉందని చెప్పవచ్చు. దీనికి వివిధ కరణాలు ఉండవచ్చు గాని, నా వంతుగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల్లో కొంత అవగాహణ కల్పించేందుకు ముందుకురావడం జరిగిందని తెలిపారు. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి అవగాహాణ కల్పించేందుకు స్వచ్చంధ సంస్థలవారు. పత్రికా సోదరులు, మీడియా మిత్రులు మనవంతుగా ఓటు హక్కు వినియోగించుకునే అంశంపై ప్రజలకు అవగాహణ కల్పించేందుకు కృషి చేద్దామని కోరారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మెధావులు, చదువుకున్న వారు, వివిధ రంగాల్లో కొనసాగుతున్నవారు. ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రజాస్వామ్యం బాగుండాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ప్రధానమైన అంశమన్నారు. ఓటు వాక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మనవంతు కృషి చేసిన వారమౌతామని ఈ వి షయం పట్ల ప్రతి ఒక్కరూ భద్యతతో వ్యవహారించి తప్పనిసరిగా ఓటువేయాలని హోప్ పౌండేషన్ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా నవంబర్ 30 తేదీన ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా హోప్ పౌండేషన్ చైర్మన్ కొండా విజయకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ తడిబోయిన రామస్వామి యాదవ్, హోప్ పౌండేషన్ సభ్యులు గాలి కృష్ణ, మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, బిక్షపతి సాగర్, శంకర్ ముదిరాజ్ , షర్పద్దీన్, పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.