Home » ఐపిఎల్ లో మరో రెండు కొత్త జట్లు డీ…

ఐపిఎల్ లో మరో రెండు కొత్త జట్లు డీ…

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : దేశంలో అతి పెద్ద ప్రీమియం లీగ్    ఐపీఎల్ 2022లో మరో రెండు కొత్త జట్లు పాల్గొనేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది బిసిసిఐ. దీనిలో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి లో ఐపిఎల్ వేలం కు సర్వం సిద్ధం చేస్తుంది బి సి సి ఐ. వచ్చే నెల 12,13 తేదీల్లో వేలం జరగనుంది. ఐ పి ఎల్ మరో కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో కు లెటర్ అఫ్ ఇండెంట్ ను జారి చేయాలని ఐ పి ఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బి సి సి ఐ లు నిర్ణయం తీసుకున్నాయి. అహ్మదాబాద్, లక్నో జట్లు ఈ ఏడాది ఐ పి ఎల్ లో భాగం కానున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని ఆర్ పి ఎస్ జీ గ్రూప్ అధినేత సంజీవ్ గోంకా 7090 కోట్లకు దాకించుకున్నారు. ఈ జట్లకు హెడ్ కోచ్ గా ఆండీ ప్లావర్, అసిస్టెంట్ కోచ్ గా విజయ్ దాహియా లను ఎంపిక చేసుకుంది. లక్నో ఫ్రాంచైజీని సీవీసీ కాపిటల్ 5625 కోట్లకు దక్కించుకుంది. జట్టు హెడ్ కోచ్ గా రవి శాస్త్రి గా నియమించనున్నట్లు సమాచారం. లక్నో కి కె ఎల్ రాహుల్, అహ్మదాబాద్ కి హార్దిక్ పాడ్యా సారద్యం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మరో వైపు ఐపిఎల్ 2022 కి పూర్తి స్థాయి స్పాన్సర్ గా రైడ్స్ దక్కించుకుంది టాటా గ్రూప్.

You may also like

Leave a Comment