Home » ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

ఏకాంతంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్,తిరుమల : తిరుమలలో శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటిని తితిదే వైభవంగా నిర్వహించింది.తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.ప్రతిఏటా పుష్య‌మి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.కాగా ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా చేపట్టినట్లు టిటిడి అధికారులు తెలిపారు.ఈ సందర్బంగా శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ బయలుదేరి శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు.తీర్థంలో కొలువై ఉన్న శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ కృష్ణ స్వాములకు మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధద్రవ్యాల‌తో అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి… అక్కడే తయారు చేసిన ప్రసాదంతో నైవేద్యం స‌మ‌ర్పించారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment