
590Views
తెలంగాణ మిర్రర్, కొండాపూర్: శేరిలింగంపల్లి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఏంటోమోలోజి డిపార్ట్మెంట్ సిబ్బందికి కేసీఆర్ రక్షణ కిట్లను పంపిణి చేశారు. ఈ కిట్లలలో సిబ్బందికి అవసరమైన గ్లౌజెస్, రెయిన్ కోట్, సబ్బులు, పలు రకాల లిక్విడ్స్, పలు రకాల వస్తువులను ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్న ఏంటోమోలోజి డిపార్ట్మెంట్ సిబ్బందిని అభినందించారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వీధి వీధి, వాడ వాడాలలోనూ వారు చేస్తున్న సేవలు గొప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏంటోమోలోజి డిపార్ట్మెంట్ కిరణ్ కుమార్ రెడ్డి, ఏరియా ఇంచార్జ్ మొహ్మ్మద్ అబ్దుల్ సత్తార్, సిబ్బంది పాల్గొన్నారు.