Home » ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కు ప్రభుత్వ విప్ గాంధీ శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కు ప్రభుత్వ విప్ గాంధీ శుభాకాంక్షలు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా తాతా మధుసూదన్ గురువారం పదవీ ప్రమాణంస్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ తన చాంబర్‌లో పదవీ ప్రమాణం చేయించారు.ఈ సందర్బంగా రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,హోం శాఖ మంత్రి మహబూబ్ అలీ,మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,ఎంపిలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత,ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ,నల్లమోతు భాస్కర్ రావు,ఉపేందర్ రెడ్డి,సండ్ర వెంకటవీరయ్య,రాములు నాయక్, హరిప్రియ నాయక్,రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి.నరసింహాచార్యులు,జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు,ఉప్పలపాటి శ్రీకాంత్,మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు,చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు తాతా మధుసూదన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment