
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : మేడ్చల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పై ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా యాదవ జాతి బొగ్గుమంది. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ పిలుపుమేరకు గురువారం సంగారెడ్డి జిల్లా తెల్లపుర్ గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఐలేష్ యాదవ్ మరియు జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ లు మాట్లాడుతూ సోమవారం చర్లపల్లి డివిజన్ లో దోబీ ఘాట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి ఆహ్వానం లేకుండా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభిస్తుండగా చర్లపల్లి డివిజన్ స్థానికులు బొంతు శ్రీదేవికి ప్రోటోకాల్ ప్రకారంగా చెప్పాల్సిన అవసరం ఉందని వారితో వారించగా వెంటనే బేతి సుభాష్ రెడ్డి అగ్రకుల అహంకారంతో గొల్లఎక్కిరిది అని దూషించి, నేను తలుచుకుంటే దాన్ని వెంటనే 10 వేలు ఇస్తే చంపేస్తారని బెదిరింపు అహంకారపూరిత అనుచిత వాక్యాలు చేసిన ఉప్పల్ ఎమ్మేల్యే. యాదవ జాతి ఆడబిడ్డను అవమానించిన అగ్రకుల అహంకారి బేతి సుభాష్ రెడ్డి ఒక బీసీ మహిళను అందులో ప్రజా ప్రతినిధిని పరుష పదజాలంతో మాట్లాడం ఎమ్మెల్యే పదవిని అవమానించడమే. బీసీలంత ఏకమైతే రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో సుభాష్ రెడ్డికి డిపాజిట్ గలంతు చేసే సత్తా బీసీలకు ఉంది అని వారు గుర్తుచేశారు. కావున ఉప్పల్ ఎమ్మెల్యే వెంటనే భేషరత్తుగా బొంతు శ్రీదేవికి మరియు యాదవ జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా సంగారెడ్డి జిల్లలో యాదవులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని, అవసరం అయితే మా రాష్ట్ర కార్యవర్గ నాయకులతో చర్చించి రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో మా తరుపున యాదవ బీసీ అభ్యర్ధులను పోటీలో నిలబెట్టి సుభాష్ రెడ్డిని ఒడించేవరకు శ్రమిస్తామని వారు హెచ్చరించారు. వెక్తిగత దుషనాలకు పాల్పడిన అయా రాజకీయ పార్టీ నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయా పార్టీల అధ్యక్షులను ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్,జిల్లా అధ్యక్షులు పెరుగు ఐలేశ్ యాదవ్, పెరుగు చంద్రయ్య యాదవ్, మల్లేశ్ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రాజబోయిన సంతోష్ యాదవ్, జిల్లా కార్యదర్శి వెంకటేష్ యాదవ్, యువజన కార్యదర్శి వివేక్ యాదవ్, హరీష్ యాదవ్, బాబులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.