Home » ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాం : కార్పొరేటర్ పుష్పానగేష్

ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాం : కార్పొరేటర్ పుష్పానగేష్

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో రామచంద్రాపురం డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేష్ పేర్కొన్నారు. శ్రీనివాస్ నగర్ లోని 14వ బ్లాక్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ సమస్యలను సోమవారం జలమండలి అధికారులు,పారిశుధ్య సిబ్బందితో కలిసి.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పక్కనే నూతనంగా వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కలిపితే డ్రైనేజీ సమస్య తీరనుందని కార్పొరేటర్ తెలిపారు. అనంతరం ఆమె అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ పాత డ్రైనేజీ పైప్ లైన్ లో నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని నూతనంగా వేసిన పైప్ లైన్ లోకి మల్లించాలని అధికారులను కార్పొరేటర్ పుష్పానగేష్ ఆదేశించారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.దశల వారీగా డివిజన్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో శ్రీనివాస్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయనికార్పొరేటర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు బూరుగడ్డ నగేష్,సీఎం మల్లేష్, ప్రొద్దుటూరు లక్ష్మణ్,కోల్కట్ట శ్రీను,జ్ఞానేశ్వర్,రాగం యాదయ్య,సజ్జ యాదయ్య, బేగరి శంకర్,సిహెచ్ నాగరాజు,జిలాని,యాదగిరి,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment