Home » ఎమ్మెల్యే గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ అభివృద్ధి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఎమ్మెల్యే గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ అభివృద్ధి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

by Admin
430Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు.మంగళవారం డివిజన్ పరిధిలోని మయూరినగర్ లో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజి లైన్ పనులను జిహెచ్ఎంసి అధికారులు ,స్థానికులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ ను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ పనులలో జాప్యం లేకుండా,త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులో కి తీసుకురావాలని,పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డీఈ స్రవంతి,ఏఈ శివరాం ప్రసాద్,వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment