Home » ఎమ్మెల్యే గాంధీ ని కలిసిన వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రతినిధులు

ఎమ్మెల్యే గాంధీ ని కలిసిన వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రతినిధులు

by Admin
490Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ విప్ గాంధీని గురువారం వివేకానంద నగర్ లోని తన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. నాల సమస్యలతో సతమవుతున్న హెచ్ఎండిఏ పరిధిలోని స్ధల యాజమానుల, నిర్మాణదారల సమస్యలను పరిష్కరం కోరుతూ. ఈ సందర్బంగా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ హెచ్ఎండిఏ పరిధిలోని 15 % ఏరియా ను తాకట్టు పెట్టుకొని నిర్మణాలకు బిల్డింగ్ అనుమతులు ఇచ్చి నిర్మణాలు పూర్తి అయిన సంవత్సర కాలమైన నాల సమస్యతో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాక రెసిడెంట్స్, నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా నాల సమస్యతో హెచ్ఎండిఏ పరిధిలో స్థల యజమానులు నిర్మాణాలు చేసుకుందాం అనుకుంటే బిల్డింగ్ పర్మిషన్ నాల సమస్యతో ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారని హెచ్ఎండిఏ పరిధిలోని నిర్మాణాలు పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నాల సంబంధించిన చార్జీలు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని సంబంధించిన అధికారులకు ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి అసోసియేషన్ తరుపున వినతిపత్రం అందజేశారు.దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ పై విషయాన్నీ ప్రభుత్వం దృష్టికి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి సమస్యను విన్నవించి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని అసోసియేషన్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధీని కలిసిన వారిలో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముప్పా సుబ్బయ్య , జనరల్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వి రంగారావు, కెవి ప్రసాద్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ రామ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు రాజేంద్రప్రసాద్, సుభాష్ బాబు, కమిటీ మెంబెర్ ధీరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment