Home » ఎమ్మెల్యే గాంధీ కి వినతి పత్రం అందజేసిన పిజెఆర్ నగర్ కాలనీ వాసులు

ఎమ్మెల్యే గాంధీ కి వినతి పత్రం అందజేసిన పిజెఆర్ నగర్ కాలనీ వాసులు

by Admin
520Views

తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి:  గచ్చిబౌలి ప్రధాన రోడ్డు విస్తరణ లో భాగంగా పిజెఆర్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు రోడ్డు విస్తరణ ను 200 ఫీట్ల నుండి 150 ఫీట్ల వరకు తగ్గిచాలని గౌరవ ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పిజెఆర్ సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ మీనాక్షి టవర్స్  నుంచి గచ్చిబౌలి ప్రధాన రహదారి కి వెళ్లేందుకు అక్కడి నుంచి మీనాక్షి టవర్స్ రోడ్డు కు చేరుకునేందుకు గచ్చిబౌలి ప్రధాన రహదారి పైన వంతెనకు ర్యాంపుల నిర్మాణం జరుగుతుంది అని ఓఆర్ఆర్ మధ్యలో నుంచి మరో వంతెన మొదలవుతుంది అని అది గచ్చిబౌలి వంతెన మీదుగా వెళ్లి ర్యాడి సన్ వద్ద ముగుస్తుంది అని గచ్చిబౌలి ప్రధాన రహదారి విస్తరణ వలన ఆస్తులకు తీవ్ర నష్టం కలుగుతుంది అన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన గౌరవ ప్రభుత్వ విప్ గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని గాంధీ పేర్కొన్నారు. అందరికి ఆమోదయోగ్యమయ్యే విధంగా రోడ్డు విస్తరణ కు కృషి చేస్తానని ఆయన తెలియచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు చాంద్ పాషా, పిజెఆర్ సంక్షేమ సంఘం సభ్యులు కైలాష్ సింగ్, అచేశ్వర్ రావు, దుర్గ ప్రసాద్, సయ్యద్ షౌకత్ హుస్సేన్, రంగరావు, సంకేశ్ సింగ్, కృష్ణ గౌడ్, Md రియజుద్దీన్, పౌల్ ప్రకాష్, శైలేందర్ సింగ్, మహమ్మద్ అబ్దుల్ అజిజ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment