Home » ఎమ్మెల్యే గాంధీని భారీ మెజార్టీతో గెలిపిద్దాం : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఎమ్మెల్యే గాంధీని భారీ మెజార్టీతో గెలిపిద్దాం : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

by Admin
8.7kViews
73 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ప్రతి డివిజన్ అభివృద్ధి బాటలు నడిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి కృషి చేస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.మంగళవారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కార్పొరేటర్ రాగం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లోని అన్ని కాలనీలలో సౌకర్యవంతమైన రహదారులు, తాగునీరు, డ్రైనేజీలు, వరద కాలువలు, పార్కులు వంటి ఎన్నో మౌలిక వసతులను కల్పించారని తద్వారా ప్రజలకు ఎంతో సౌలభ్యం లభించిందన్నారు. అభివృద్ధికి పాటుపడే గాంధీకే, మరోమారు ఓటు వేసి గెలిపించి ఓటుతో మూడోసారి విజయాన్ని అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, డివిజన్ గౌరవ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్ శ్రీకళ, బూత్ కమిటీ సభ్యులు, ఆయా బస్తీ కమిటీ అధ్యక్షులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment