Home » ఎమ్మెల్యే అరెకపుడి గాంధీ ని కలిసిన కాలనీ నూతన కమిటీ

ఎమ్మెల్యే అరెకపుడి గాంధీ ని కలిసిన కాలనీ నూతన కమిటీ

by Admin
1.1kViews

శేరిలింగంపల్లి (తెలంగాణ మిర్రర్):  మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ కి నూతనంగా ఏర్పడిన కాలనీ అసోసియేషన్ సభ్యులు  ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా  అరేకపూడి గాంధీ  మాట్లాడుతూ  హెచ్ఎంటి   స్వర్ణపూరి కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు.  కాలనీ వాసులందరికి ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ ,ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడి ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  హెచ్ఎంటి   స్వర్ణపూరి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి , జనరల్ సెక్రటరీ దేవేందర్ రావు , ఎక్స్క్యూటివ్ మెంబెర్స్ దశరథ్ రావు ,విద్యానంద చారి, రమేష్ చంద్ర ,సురేష్  విరూపక్షయ్య ,రామయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment