
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీకి మద్దతుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శుక్రవారం డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్, నెహ్రూ నగర్, గోపినగర్, బాపునగర్, ప్రశాంతి నగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అంతకుముందు ఆదర్శనగర్ రోడ్ నెం.1 రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం మాట్లాడుతూ..మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థి అరేకపూడి గాంధీ ని ఆశీర్వదిస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని అన్నారు.ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ సోమ దాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రవీందర్, సీనియర్ నాయకులు రాఘవ రావు, సత్యనారాయణ, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, వార్డు మెంబర్లు పర్వీన్ బేగం, శ్రీకళ, గౌరవ డివిజన్ సీనియర్ నాయకులు, బస్తీ కమిటీ మెంబర్స్, బూత్ కమిటీ మెంబర్స్, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, మహిళా నాయకురాలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.