
10.0kViews
88
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ నినాదామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ అన్నారు.మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీకి మద్దతుగా మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ లో మొవ్వ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే గాంధీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు, ఆయా బస్తీ కమిటీ అధ్యక్షులు,మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.