Home » ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ గెలుపు ఖాయం : మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ గెలుపు ఖాయం : మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

by Admin
11.3kViews
79 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మూడోసారి శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ గెలుపు ఖాయమని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇంటింటి ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో బిఆర్ఏస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పేద,మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కోసం ఆసరా పింఛన్లు, మహిళలకు కేసీఆర్ కిట్లు,కళ్యాణ లక్ష్మి,షాదిముబారక్,గృహలక్ష్మి,బిసి బంధు,దళిత బంధు,వికలాంగుల పింఛన్లు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధికి మౌలిక వసతుల కల్పన,అండర్ పాసులు,ప్లైఓవర్స్,లింకు రోడ్లను ఎర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్,వార్డ్ మెంబర్లు ,నరేష్, అంజమ్మ,ఏరియా కమిటీ సభ్యులు , సీనియర్ నాయకులు సంపత్,నారాయణ,అనిల్ సింగ్ ,జగదీశ్, శామ్లెట్ శ్రీనివాస్,మధు,విజయ లక్ష్మి,అక్బర్, ఇమ్రాన్,సలావుద్దీన్, అజ్ మత్,జకీర్, లియాకత్,తహర్, బరాన్,మక్ బూల్,సుధాకర్, దయాకర్,అర్జున్,కల్పన, బాలమణి, నీరజ,సుగుణ,మాధవి,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పాల్గొన్నారు.

You may also like

Leave a Comment