Home » ఎన్టీఆర్ నగర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

ఎన్టీఆర్ నగర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

by Admin
390Views

* ఎన్టీఆర్ నగర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు….

హాజరైన కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ పండుగ సంబరాల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను అన్ని అన్నారు . మహిళలు, యువతులు, చిన్నారులు పట్టు వస్త్రాలు, నూతన వస్త్రాలతో సాంప్రదాయబద్దంగా తయారై తెలంగాణ ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలు, బంతి పూలతో సద్దుల బతుకమ్మను తయారు చేసి ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. తరతరాలుగా ఆడపడుచులు బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆనందంగా ఆడుకునే పండుగ. తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ అన్ని అన్నారు. తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మ గౌరవం ఈ బతుకమ్మ పండుగ .ఆడ బిడ్డలను,అల్లుండ్లను ఇంటికి పిలిచి కానుకలు ఇవ్వడం ఈ పండుగ ఆచార సంప్రదాయం బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే పండుగలు సద్దుల బతుకమ్మ,దసరా పండుగలు.ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని రక్షించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అన్ని అన్నారు.అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్ని అన్నారు.ఈ కరోనా మహమ్మారి దృష్ట్యా మాస్కులు ధరిస్తూ,భౌతిక దూరం పాటిస్తూ ఈ పండుగలని జరుపుకోవాలి మరోసారి ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ,దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, చిన్నారులు బీజేపీ నాయకులు, స్థానిక నేతలు, బస్తి వాసులు , కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment