Home » ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ మృతి

ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ మృతి

by Admin
390Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు.తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో గత నాలుగు రోజుల నుండి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాశ విడిచారు.తాండ్ర కుమార్ మరణం తీరని లోటని కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఆయా పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు బాగ్ లింగంపల్లిలోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్ లో ప్రజల దర్శనార్థం కామ్రెడ్ తాండ్ర కుమార్ భౌతిక దేహాన్ని ఉంచారు.మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన స్వస్థలమైన మియాపూర్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

 

You may also like

Leave a Comment