
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్లుగా నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడుతోందని శేరిలింగంపల్లి బిజెవైఎం నాయకులు ఆరోపించారు.ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ మంగళవారం శేరిలింగంపల్లి బీజేవైఎం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే కొలువులు వస్తాయని యువకులు, స్టూడెంట్స్, నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాడారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యమ ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నా.. నోటిఫికేషన్లు వేయడం లేదని ఆరోపించారు.ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్,రాష్ట్ర ఉమెన్ సెల్ కన్వీనర్ కసిరెడ్డి సింధు రెడ్డి,రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్,జిల్లా కార్యదర్శులు పిల్లి సాయి,కుమార్ సాగర్,కన్వీనర్ అమర్నాథ్ యాదవ్,కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి , హఫీస్ పెట్ డివిజన్ అధ్యక్షుడు నందు,మియాపూర్ డివిజన్ అధ్యక్షులు సిద్ధూ,బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయి సుకుమార్ పటేల్,ఉదయ్ సాగర్, రాఘవేంద్ర,బాలు,ధరణి, గోవింద్,రాజు,హర్షిత్,కె రాజు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.