
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని.. సిసిఎస్ బాలానగర్ జోన్, సిసిఎస్ శంషాబాద్ జోన్, సిసిఎస్ మాదాపూర్ జోన్, సిసిఎస్ మేడ్చల్ జోన్ కు చెందిన పోలీసు సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు సోమవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించి రివార్డులు అందజేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..సిసిఎస్ సిబ్బంది ఉత్తమ పనితీరుతో నేడు సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో క్రైమ్ డిటెక్షన్ రేటు 80 శాతానికి పైగా ఉందని తెలిపారు. సిసిఎస్ సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యపడిందన్నారు. ప్రజల కు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిసిఎస్,లా&ఆర్డర్ వింగ్స్ ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలన్నారు.ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి సీపీ గారు రివార్డులు అందజేశారు. సిబ్బందికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిసిపి క్రైమ్స్ శ్రీ కల్మేశ్వర్ సింగెన్వర్, ఐపీఎస్., మాదాపూర్ డిసిపి సందీప్, ఏడిసిపి మాదాపూర్ నంద్యాల నరసింహారెడ్డి, ఏడీసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.