Home » ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థినిని పరామర్శించిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థినిని పరామర్శించిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్,అమీన్‌పూర్ : ఉక్రెయిన్‌లో ఎంబిబిఎస్‌ చదువుతున్న అమీన్‌పూర్ మారుతి నగర్ కాలనీకి చెందిన రమణయ్య కుమార్తె మౌనిక క్షేమంగా ఇంటికి చేరింది. అక్కడ యుద్ధ పరిస్థితి నెలకొనడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్రెయిన్‌ దేశం నుంచి స్వదేశానికి క్షేమంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న సంగా రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు,అమీన్ పూర్ 15 వార్డ్ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి అక్కడి పరిస్థితులను, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు శశిధర్ రెడ్డి, మున్నా,విజయ్,నాయకులు శ్రీనివాస్,మహేష్,మహిపాల్ రెడ్డి,క్రిష్ణ,శేఖర్ తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment