
*చందానగర్ డివిజన్, గాంధీ విగ్రహం వద్ద ఈ -శ్రమ్ కార్డ్ సెంటర్ ను ప్రారంభించిన.. రవి కుమార్ యాదవ్ , మువ్వ సత్యనారాయణ*

దరఖాస్తు చేసుకుంటున్న అర్హుదారులు
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ – శ్రమ్ కార్డు శిబిరాన్ని రవి కుమార్ యాదవ్ , మువ్వ సత్యనారాయణ ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి కార్డులను అందచేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ-శ్రమ్ కార్డ్ అనేది కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు. 15000 ఆదాయం మించని ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ కార్డు పొందవచ్చు ..ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. పోర్టల్‌లో నమోదైన కార్మికుడు ప్రమాదానికి గురైతే, మరణం లేదా పూర్తి అంగవైకల్యం సంభవించినప్పుడు రూ.2 లక్షలు, సగం అంగవైకల్యం సంభవించినపుడు 1 లక్ష రూపాయలు పొందవచ్చు అని తెలియజేసారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో ప్రతి బస్తి, కాలనీలు, అపార్ట్మెంట్ లో క్రమంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతిఒక్కరూ లబ్ధి పొందెల చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిదంగా మువ్వ సత్యనారాయణ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులందరూ, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ – శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవడం ద్వారా ఉచిత భీమా సౌకర్యంతో ఆర్థిక భద్రత కల్పించుకోవాలని పిలుపునిచ్చారు. అర్హులైన వారందరూ తప్పకుండా ఈ యొక్క పథకంలో చేరి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు రవి కుమార్ యాదవ్, మువ్వ సత్యనారాయణ, కసిరెడ్డి సింధు రెడ్డి, కసిరెడ్డీ రఘునాథ్ రెడ్డి, డి.ఎస్.అర్.కె.ప్రసాద్, రామిరెడ్డి , గూడూరిత్రినాథ్, శ్రీనివాస్ ముదిరాజ్ , మల్లేశ్ గౌడ్, కిరణ్ , శివ , మురళి ,సాయి మురళి , శివ రత్నాకర్ , పవన్, సాయి కిరణ్, లక్ష్మణ్ ముదిరాజ్, గుండె గణేష్, జె రాము, పలువురు నాయకులు పాల్గొన్నారు.