Home » ఈ నెల 2 న ఖమ్మలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా : మారబోయిన రఘునాథ్ యాదవ్

ఈ నెల 2 న ఖమ్మలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా : మారబోయిన రఘునాథ్ యాదవ్

by Admin
11.3kViews
121 Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  బీజేపీ పార్టీలో ఇమడలేకనే   పార్టీ మారుతున్నానని మారబోయిన రఘునాథ్ యాదవ్ అన్నారు. శుక్రవారం మదీనా గూడ లోని కిన్నెర గ్రాండ్ లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశం లో రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ  బీజేపీ ,బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం  ఉండడం వల్లనే బిజెపి పార్టీ నచ్చక నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ లోకి జూలై 2 న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నానని ఆయన తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ యువత కి కాంగ్రెస్ అండగా ఉంటుంది కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు.బిజెపి లో కుమ్ములాటలు బరించలేకనే  పార్టీ మారుతున్నానని, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గా పోటీ చేసి 100% విజయం సాధిస్తానని రఘునాథ్ యాదవ్  ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి సారథ్యంలో  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండదండలతో ముందుకు వెళ్తానన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి  గాంధీ 2 సార్లు ఎమ్మెల్యే అయిన కూడా శేరిలింగంపల్లి అభివృద్ధి చేయలేదన్నారు.హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎన్నో సాప్ట్ వేర్ కంపెనీలు  ఉన్న పక్కనే ఉన్న బస్తీల్లో తాగడానికి నీళ్లు కూడా లేవని, డ్రైనేజీ వ్యవస్థ , రోడ్లు బాగాలేవన్నారు ఇవన్నీ  ఎమ్మెల్యే గాంధీ కి కనపడవు అని విమర్శించారు.

You may also like

Leave a Comment