
తెలంగాణ మిర్రర్, తిరుమల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ – 19 మూడవ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టిటిడి మరోకసారి భక్తులకు తెలిపింది. ఇదివరకే టిటిడి ఈ విషయాన్ని పలు మార్లు తెలియజేసిన విషయం తెలిసిందే. పలువురు భక్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. దీనివలన అనేక మంది భక్తులకు ఇబ్బంది కల్గుతుంది. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. కావున భక్తులు తమ ఆరోగ్యం, అదేవిధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాలని కోరారు.