Home » ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్

by Admin
10.4kViews
150 Shares

 

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి మాటనిలబెట్టుకుంటామని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు. సోమవారం మియాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న న్యూ కాలనీ, లక్ష్మి నగర్, ఓం కార్ నగర్ తదితర కాలనీ లు, బస్తీ లల్లో గడప గడప కు రఘన్న కార్యక్రమంలో ఆరు సంక్షేమ పథకాల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ…రా.. కాంగ్రెస్ సైనికుడా… సమయం అసన్నమైంది… విజయమో… వీర స్వర్గమో తెల్చుకుందాం… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇద్దాం..! హస్తం గుర్తుకే ఓటేద్దాం.! అని పిలుపునిచ్చారు.*ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించే వాళ్లను ప్రజలు కూడా విస్మరిoచాలన్నారు. *తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంటికో ఉద్యోగం… నీళ్లు నిధులు,నియామకాలువంటూ గొప్పలు.. చెప్పుకున్న నాయకులు ఇప్పుడు అదే మాటను ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేటప్పుడు చెప్పాలన్నారు. ఎన్ని ఇళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు..? ఎన్ని ఇండ్లకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇచ్చారో, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నియోజకవర్గంలో ప్రజలకు ఎన్నిచ్చారో…శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. డివిజన్, కాలనీ, బస్తీ లల్లో ఏ మొహం పెట్టుకుని వస్తారని నిలదీశారు.నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మాత్రం ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్నట్టు చేశారాని, అధికార పార్టీ నాయకులు మొనగాళ్లు అయితే నియోజకవర్గం లో గత ఎన్నికలేప్పుడు ప్రకటించిన పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పార్టీ కోసం… నాకోసం…ఈ రెండు నెలలు కష్టపడి పనిచేయాలని ఏ ఇబ్బందులు వచ్చినా నేను మీకు అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గం, డివిజన్, కాలనీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

You may also like

Leave a Comment