Home » ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది

ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది

by Admin
1.2kViews

* ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి
*ప్రధాని మోదీ,మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపిన విద్యార్థులు

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.వీరిలో 17మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. శేరిలింగంపల్లి డాక్టర్స్ కాలనీకి చెందిన 5 వ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి సూర్యవంశీ సుప్రియ, లింగంపల్లికి  చెందిన మానస 2 వ సంవత్సరం ఉక్రెయిన్ లోని బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్స్ కోర్స్ చదువుతున్నారు.కాగా వీరు క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చినందుకు ముందుగా ప్రధాని మోదీ,తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

 

You may also like

Leave a Comment