
*జిన్నారం మండలంలోరూ.1 కోటి 62 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : ఇంటింటా సంక్షేమం.. గ్రామ, గ్రామాన అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మండల పరిధిలోని అండూరు,సోలక్పల్లి రాళ్ల కత్వా,ఊట్ల,మంగంపేట,జంగంపేట జిన్నారం గ్రామాలలో రూ.1 కోటి 62 లక్షల చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం దాది గూడలో నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మూలంగా నిధుల కేటాయింపులో సమస్యలు ఉన్నప్పటికీ, అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకంజ వేయడం లేదని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.