
1.2kViews
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట వారు షేక్ పేట దర్గా వద్ద ఉన్న ఆదిత్య హోం ప్రయివేట్ లిమిటెడ్ వారి నివాస గృహ సముదాయం ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన వైద్యులు అక్కడ నివసిస్తున్న, పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది మొత్తం 70 మందికి పలు పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారిని పరీక్షించి తగిన వైద్య సలహా, సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ ప్రైమ్ వైద్యులు డా అర్చన, హృద్రోగ నిపుణులు, డా. మౌనిక, జనరల్ ఫిజిషియన్ లతో పాటూ నర్సింగ్ సిబ్బంది అనితా రేజి, స్నేహ పి షాజీ, తులసి లతో పాటూ విజయ్ చందర్, క్యాంప్ కో ఆర్డినేటర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.