Home » ఆశీర్వదించండి.. అండగా ఉంటా…అరెకపూడి గాంధీ

ఆశీర్వదించండి.. అండగా ఉంటా…అరెకపూడి గాంధీ

by Admin
11.3kViews
136 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు.శుక్రవారం హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీలో బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో వేల కోట్లతో వ్యయంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.మహిళ పక్షపాతి అని మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు అని,ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ షాది ముబారక్, ఒంటరి మహిళల కు పింఛన్లు,కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం ,అసరా పెన్షన్ల పెంపు,దివ్యాంగుల పెన్షన్ పెంపు,400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మహిళలకు పెద్ద ఉపశమనమని అన్నారు.ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు చేయడం గొప్ప విషయం అని ,లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , అర్హులైన పేద మహిళలదరికి ప్రతి నెల 3,000 రూపాయలు జీవన భృతి ని అందించడం గొప్ప విషయమని అనాన్రు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు , కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment