Home » ఆర్ కృష్ణయ్య దీక్షకు మద్దతు తెలిపిన బిసి సంఘం నాయకులు

ఆర్ కృష్ణయ్య దీక్షకు మద్దతు తెలిపిన బిసి సంఘం నాయకులు

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  బిసి బంధు ప్రకటించాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వివిధ జిల్లాలకు చెందిన సంఘం సభ్యులతో తరలి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రoలో వెనుకబడిన బిసికులాల అభివృద్ధికి బిసి బంద్ ప్రకటించాలని ఆర్. కృష్ణయ్య చేపట్టిన దీక్షకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకోవడానికి అన్ని కులాల వారు కల్సి రావాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. బీసీల హక్కుల కోసం, అభివృద్ధి కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఆర్.కృష్ణయ్య కు మనమంతా అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దామని పేర్కొన్నారు. ధర్మ పోరాట దీక్షకు తరలి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మద్దతు తెలిసిన వారిలో సంగారెడ్డి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, వనపర్తి ఉప సర్పంచ్ ,లక్ష్మణ్ యాదవ్, చందు యాదవ్ తదితరులున్నారు.

బిసి బంద్ తోనే బీసీల అభివృద్ధి –  భేరి రాంచందర్ యాదవ్..

బిసి బంద్ పేరుతో ప్రతీ కుటుంబానికి పది లక్షలు ఇస్తేనే బిసిల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. మంగళవారం రోజు శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో బిసి బంద్ ప్రకటించాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్, సంగారెడ్డి జిలా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, వనపర్తి ఉప సర్పంచ్ ఈ. లక్ష్మణ్ యాదవ్, చందు యాదవ్ లతో కల్సి డిప్యూటీ ఎలక్షన్ అధికారి మణిపాల్ కు వినతిపత్రం సమర్పించారు. వెనుకబడిన బిసిలందరికి బిసి బంద్ అమలయ్యేలా కేసీఆర్ చొరవ తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్ని కులాల వారిని సమానంగా చూడాలని, పక్షపాత ధోరణితో ముఖ్యమంత్రి వ్యవహరించకూడదని నర్సింలు ముదిరాజ్, గణేష్ యాదవ్ లు కోరారు.

You may also like

Leave a Comment