
980Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీసులు తీసుకొని ప్రారంభించిన ప్రజాసంగ్రామ పాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. చేవెళ్ల మోడల్ కాలేజ్ నుండి ఆలూరు గేట్, చింట్టపల్లి గేట్ వరకు దుబ్బాక బీజేపీ శాసన సభ్యులు రఘునందన్ రావు, బీజేపీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ వారితో పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.