
తెలంగాణ మిర్రర్, మాదాపూర్: ఆన్ లైన్ యాప్స్ తో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు రంగంలోకి దిగి 7చోట్ల దాడులు నిర్వహించగా 23 మంది బుకీలు పట్టుపడ్డారు. వారి వద్ద బెట్టింగ్ కు పాల్పడుతున్నరూ. 93 లక్షల నగదును సీజ్ చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తదితర విలువైన సొత్తు కలిపి మొత్తం 2.2 కోట్ల విలువ గల సొత్తు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసిన సందర్భంగా గచ్చి బౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. దుబాయ్ లో జరుగుతున్నముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ముఠా బెట్టింగ్ నిర్వహస్తుండగా పక్కా సమాచారం తో 7 చోట్ల దాడులు నిర్వహించామని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్ దేవ్ పల్లిలో దాడులు చేయగా మొత్తం 23 మంది బుకీలు పట్టుపడ్డారు. వారి వద్ద 93 లక్షల నగదు సీజ్ చేశారు.అలాగే 14 బెట్టింగ్ బోర్డులు, 247 మొబైల్ ఫోన్లు, 8 ల్యాప్ టాప్ లు, 2 రూటర్లు, 5 కార్లతో కలిపి మొత్తం 2.2 కోట్ల విలువైన సొత్తు సీజ్ చేశామని ఆయన వివరించారు. నిందితులు గూగుల్ లో ఉన్న మొబైల్ యాప్స్ తో బెట్టింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. క్రికెట్ బెట్టింగ్ నాలుగు లేయర్స్తో నిర్వహిస్తున్నారని, మెయిన్ బుకి తో అనుసంధానం గా మరో ముగ్గురు బుకీలు పనిచేస్తారని, మొబైల్ యాప్స్ నుండి సమాచారం తీసుకుని బెట్టింగ్ జరుపుతున్నారని తెలిపారు.ఆన్ లైన్ యాప్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు ముంబయి, గోవా , దుబాయ్ లతో వీరికి నెట్ వర్క్ ఉన్నట్లు గుర్తించామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ గ్యాంగ్ కు మహా అనే వ్యక్తి విజయవాడ కు చెందిన మెయిన్ బుకి ఉన్నాడని ఆయన తెలిపారు. పట్టుపడ్డ బుకీలపై గేమింగ్ యాక్ట్, తో పాటు మొత్తం 7 కేసులు నమోదు చేశామని, బెట్టింగ్ నిర్వహిస్తున్న యాప్స్ ను తొలగించాల్సిందిగా గూగుల్ కు లేఖ రాస్తామన్నార.