
400Views
తెలంగాణ మిర్రర్, మియాపూర్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ క్రాస్ రోడ్, మియపూర్ మమత ఎస్టేట్స్ భజరంగీ యువ సైన్యం సభ్యులు పృథ్వి కాంత్ మట్టి వినాయక మండపంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శేరిలింగంపల్లి అసెంబ్లీ జ్ఞానేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సామూహిక మహా హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవధాన సరస్వతీ పీఠం శ్రీ మాడుగుల నాగఫణి శర్మ పాల్గొని ఆ గణనాథుడికి మహిళ మూర్తులతో కలిసి మహా హారతిని సమర్పించారు.తదనంతరం వారి ఆ గణనాథుడి యొక్క ప్రవచనాలను ప్రజలకు వినిపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.