Home » ఆదిశిలా క్షేత్రంలో ఘనంగా పూజలు

ఆదిశిలా క్షేత్రంలో ఘనంగా పూజలు

by Admin
1.3kViews

తెలంగాణ మిర్రర్, జోగులాంబ గద్వాల:  జోగులంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు, వాల్మీకి పూజారులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ చైర్మన్ ప్రహలాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన వసతులు కల్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన మల్దకల్ తిమ్మప్ప స్వామి ఆలయానికి ప్రతి శనివారమే కాక ఇతర వారాలలో కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటారు. దేవాలయ పరిసరాల్లో జరిగే అభివృద్ధి పనులను దేవాలయ చైర్మన్ ఈవో లు దగ్గరుండి నిర్వహిస్తున్నారు.

You may also like

Leave a Comment