Home » ఆదర్శవంతమైన డివిజన్ గా శేరిలింగంపల్లి : అరెకపూడి గాంధీ

ఆదర్శవంతమైన డివిజన్ గా శేరిలింగంపల్లి : అరెకపూడి గాంధీ

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్  ఆధ్వర్యంలో తెరాస పార్టీ అనుబంధ సంఘ సభ్యులు తెరాస నాయకులు , కాలనీ వాసులు డివిజన్ లో నెలకొన్న డ్రైనేజి, రోడ్లు , విధి దీపాల వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గాంధీ కలిసి వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, డివిజన్ పరిధిలోని కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , అందరికి ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ కాలనీల సమస్యల పై స్పందిస్తూ, ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి డివిజన్ అభివృద్ధి కి పాటుపడాలని, శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్,రవి యాదవ్ ,ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు రమేష్ ,కృష్ణ యాదవ్,వార్డ్ మెంబర్ పొడుగు రాంబాబు, వేణు ,రమణయ్య ,చైతన్య, నటరాజ్, పవన్ కుమార్ , కోడిచెర్ల మహేష్,సురేష్ యాదవ్,శ్రీకాంత్ యాదవ్ ,మహేష్ యాదవ్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment