
తెలంగాణ మిర్రర్, కొండాపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో తెరాస పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని, కేసిఆర్ ఆదేశాలనుసారం, తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సూచనలు మేరకు గురువారం తెరాస పార్టీ జెండా పండుగను కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ తెరాస పార్టీ ఆఫీసులో తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. అణిచివేత పరిస్థితులను ఆధిగమించి, ఆత్మగౌరవ ప్రతీకగా ఎగిరిన ఏకైక జెండా తెరాస పార్టీ జెండా అని అన్నారు. తెలంగాణలో వ్యక్తిగత ఎజెండాతో వచ్చిన ఎన్నో జెండాలు తమ ఎజెండా ముగియగానే తెలంగాణ అంశాన్ని గాలికొదిలేసారన్నారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ వచ్చుడో, లేక సచ్చుడో అని చావు నోట్లో తల పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సెప్టెంబర్ 2 తెరాస పార్టీ చరిత్రలో మర్చిపోలేని రోజుగా మిగులుతుందని అన్నారు. ఈ సందర్బంగా మన తెలంగాణ రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు చాంద్ పాషా, బాలరెడ్డి, నిర్మల, గౌరీ, రూపారెడ్డి, నరసింహ సాగర్, పేరుక రమేష్ పటేల్, శ్రీనివాస్ చౌదరి, శామ్యూల్ సాయి కుమార్, బసవ రాజు, రవి శంకర్ నాయక్, రవి గౌడ్, తాడెం మహేందర్, నందు, ఎర్ర రాజు, అశోక్ సాగర్, వెంకటి, తిరుపతి యాదవ్, రామకృష్ణ, ప్రభాకర్, గౌస్ పటేల్, శివకుమార్, గణపతి, ముక్తార్, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, మంగలి కృష్ణ, దీపక్, షేక్ రఫీ, వివిరావు, వసీమ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.